ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2017 (17:23 IST)

చైనా ఓపెన్ సిరీస్: సెమీఫైనల్లో ఖంగుతిన్న సానియా మీర్జా జోడీ

చైనాలోని బీజింగ్‌లో జ‌రుగుతున్న చైనా ఓపెన్ సిరీస్‌లో భారత్‌కు చుక్కెదురైంది. ఈ టోర్నీ నుంచి భారత సానియా మీర్జా- షూయ్ పెంగ్ జోడీ నిష్క్రమించింది. ఈ టోర్నీ సెమీ ఫైన‌ల్స్‌లో భాగంగా జరిగిన సూప‌ర్ టై బ్రేక

చైనాలోని బీజింగ్‌లో జ‌రుగుతున్న చైనా ఓపెన్ సిరీస్‌లో భారత్‌కు చుక్కెదురైంది. ఈ టోర్నీ నుంచి భారత సానియా మీర్జా- షూయ్ పెంగ్ జోడీ నిష్క్రమించింది. ఈ టోర్నీ సెమీ ఫైన‌ల్స్‌లో భాగంగా జరిగిన సూప‌ర్ టై బ్రేక్‌లో స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్, తైవాన్‌కి చెందిన చాన్ యంగ్ జాన్‌ల జోడి చేతిలో సానియా జోడీ ఖంగుతింది. ఆద్యంతం ప్రత్యర్థి జోడీ పైచేయిగా నిలిచింది. ఫలితంగా 6-2, 1-6, 5-10 తేడాతో సానియా జంట పరాజయం పాలైంది.
 
గ‌త వారం వుహాన్‌లో జ‌రిగిన ఓపెన్ సిరీస్ సెమీ ఫైన‌ల్స్‌లోనూ సానియా మీర్జా జోడీ ఇదే మార్టినా హింగిస్ జోడీ చేతిలో ఓడిపోయింది. చైనా ఓపెన్ ఫైన‌ల్స్‌లో హింగిస్ - చాన్‌ల జోడి, తిమియా - ఆండ్రియా జోడీతో తలపడనుంది. మ‌రోవైపు సింగిల్స్‌లో సిమోనా హాలెప్ ఫైన‌ల్స్‌కి చేరుకుంది.