బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2017 (11:48 IST)

స్టీవ్ స్మిత్‌కు గాయం.. ఆందోళనలో ఆస్ట్రేలియా?

భారత్‌తో ట్వంటీ-20 సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆసీస్ జట్టును మరో గాయం ఆందోళనకు గురిచేసింది. టీ20 మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న వేళ ప

భారత్‌తో ట్వంటీ-20 సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆసీస్ జట్టును మరో గాయం ఆందోళనకు గురిచేసింది. టీ20 మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న వేళ ప్రాక్టీస్‌ సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ భుజానికి గాయమైంది. దీంతో ఆస్ట్రేలియా జట్టులో అలజడి మొదలైంది. 
 
దీంతో వెంటనే స్మిత్‌ను స్థానిక ప్రవేటు ఆస్పత్రికి తరలించి పరీక్షలు జరిపించారు. అంతేకాకుండా ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్‌ కూడా చేయించారు. పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఎటువంటి సమస్యలేదని, స్మిత్‌ ఫిట్‌గా ఉన్నాడని మ్యాచ్‌లో నిరభ్యరంతంగా పాల్గొనచ్చని ప్రకటించారు. దీంతో ఆస్ట్రేలియా బృందంలో నెలకొన్న ఆందోళన తొలగిపోయింది.