గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (22:20 IST)

సందీప్ దారుణ హత్య.. మ్యాచ్ జరుగుతున్న ప్రాంతంలోనే..?

Sandeep Singh Nangal Ambian
అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు సందీప్ నంగాల్ దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం జలంధర్‌లోని మాలియన్ గ్రామంలో కబడ్డీ కప్ జరుగుతున్న సమయంలో సందీప్ సింగ్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి హతమార్చారు. 
 
అతని తల, ఛాతిపై దాదాపు 20 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలిసింది.  మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ప్రేక్షకుల ముసుగులో ఉన్న సుమారు 15 మంది గూండాలు సందీప్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.
 
అయితే, సందీప్ ఒక దశాబ్దానికి పైగా కబడ్డీ ప్రపంచాన్ని శాసించాడు. కేవలం పంజాబ్‌లోనే కాకుండా కెనడా, యుఎస్‌ఎ, యుకేలలో సందీప్ చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు.
 
భారతీయ కబడ్డీ పోటీదారైన సందీప్‌ ఖాతాలో అనేక విజయాలు ఉన్నాయి. కబడ్డీ ఆటలో అథ్లెటిక్ ప్రతిభ, నైపుణ్యం కారణంగా అతన్ని కొన్నిసార్లు డైమండ్ పోటీదారు అని పిలుస్తారు.