మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (19:29 IST)

గోవా ఎన్నికల బరిలో లియాండ్ పేస్?

లియాండర్ పేస్ గురించి తెలియని వారుండరు. దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ ఆటగాడు. ఈయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఈయన వచ్చే యేడాది గోవా అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. పైగా, ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, దేశానికి 30 యేళ్లపాటు సేవ చేశాను. డేవిడ్ కప్, వింబుల్డెన్ వంటి మెగా టెన్నిస్ టోర్నీల్లో పాల్గొన్నాను. టెన్నిస్ స్టేడియంలో ఏ విధంగా ఉత్సాహంతో ఉన్నానో... అదేవిధంగా పాలిటిక్సి మ్యాచ్ ఆడాలని భావిస్తున్నాను అని చెప్పారు. ఇపుడు ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక ఉద్దేశ్యంతో టీఎంసీలో చేరినట్టు వెల్లడించారు.