శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (11:23 IST)

ప్యారీస్ ఒలింపిక్స్ 2024: వెయిట్ లిఫ్టింగ్‌ తొలిగింపు.. మీరాబాయ్‌కి షాక్

టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్‌కు తొలి పతకం అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను ఆదివారం పుట్టిన రోజు జరుపుకున్నది. సిల్వర్ మెడల్ తెచ్చిన ఆనందంలో తొలి సారి సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్న సమయంలోనే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) (IOC) ఆమెకు షాక్ ఇచ్చే నిర్ణయం వైపు అడుగులు వేసింది. 
 
ప్యారీస్ ఒలింపిక్స్ 2024 నుంచి వెయిట్ లిఫ్టింగ్‌ను జాబితా నుంచి తొలగిస్తున్న ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేసింది. ఇకపై ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ ఉండబోదని ఐవోసీ ఆదివారం స్పష్టం చేసింది. ఆదివారం జరిగిన సమావేశంలో ఐవోసీ సభ్యులు ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇకపై మీరాబాయ్ చాను ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశమే లేకుండా పోయింది.
 
 పురుషుల విభాగంలో తొలి ఒలింపిక్స్‌లోనే వెయిట్ లిఫ్టింగ్ ఇంట్రడ్యూస్ చేశారు. కానీ 1920 నుంచి ఇది రెగ్యులర్ ఈవెంట్‌గా ఉంటూ వచ్చింది. ఇక మహిళల విభాగంలో 2000 నుంచి ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ ఒక ఈవెంట్‌గా చేర్చారు. అయితే వెయిట్ లిఫ్టింగ్ అనేది చాలా రిస్క్‌తో కూడుకున్న క్రీడ కావడంతో దీన్ని తొలగించాలని ఐవోసీ నిర్ణయం తీసుకుంది.