బుధవారం, 27 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 జులై 2018 (10:20 IST)

రెజ్లింగ్‌లో భారత్‌కు స్వర్ణాల పంట...

టర్కీ వేదికగా జరిగిన యాసర్‌ డొగు రెజ్లింగ్‌ టోర్నీలో రెజ్లర్ బజరంగ్‌ పూనియా స్వర్ణ పథకం సాధించాడు. ఫైనల్లో 70 కేజీల విభాగంలో బజరంగ్‌తో తలపడాల్సిన ఉక్రెయిన్ ఆటగాడు ఆండ్రీ క్విటాయోస్కో గాయం కారణంగా బరిల

టర్కీ వేదికగా జరిగిన యాసర్‌ డొగు రెజ్లింగ్‌ టోర్నీలో రెజ్లర్ బజరంగ్‌ పూనియా స్వర్ణ పథకం సాధించాడు. ఫైనల్లో 70 కేజీల విభాగంలో బజరంగ్‌తో తలపడాల్సిన ఉక్రెయిన్ ఆటగాడు ఆండ్రీ క్విటాయోస్కో గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దీంతో భారత రెజ్లర్ బజరంగ్‌ విజేతగా నిలిచాడు.
 
బజరంగ్‌ రెండో అంతర్జాతీయ మెడల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 61 కేజీల విభాగం ఫైనల్లో సందీప్‌ తోమర్‌ 2–8తో యాఖెకెషి(ఇరాన్‌) చేతిలో ఓడి రజతంను సాధించాడు. 57 కేజీల విభాగంలో విక్కీ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. 
 
మహిళల 55 కేజీల విభాగంలో పింకీ 6-3తో ఓల్గా(ఉక్రెయిన్)పై గెలిచి స్వర్ణం గెలిచింది. సీమా (53 కేజీలు), పూజా (57 కేజీలు), రజని (72 కేజీలు)రజతాలు గెలువగా.. సరిత (62 కేజీలు), సంగీత (59 కేజీలు), గీత ఫొగాట్‌ (65 కేజీలు) కాంస్యాలు సాధించారు. మొత్తానికి మహిళలు 7 పథకాలతో సత్తా చాటగా, భారత్ మొత్తం 10 పథకాలను సాధించింది.