మంగళవారం, 1 జులై 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By CVR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (14:33 IST)

అరటి పండు పూర్ణాలు

కావలసిన పదార్థాలు :
అరటిపండ్లు - ఆరు,
కొబ్బతి తురుము - కప్పు
పంచదార - నాలుగు స్పూన్లు
యాలకుల పొడి - ఒక స్పూన్
జీడిపప్పులు, ఎండుద్రాక్షాలు - కొన్ని
మైదా - నాలుగు స్పూన్లు
నూనె - వేయించడానికి తగినంత
నెయ్యి - రెండు స్పూన్లు
ఉప్పు - చిటికెడు
 
తయారు చేయండి ఇలా: అరటి పండ్లను ఆవిరి మీద కొద్ది సేపు ఉంచాలి. చల్లారాక తొక్క తీసి గుండ్రంగా ముక్కలు తరగాలి. తరువాత బాణలిలో నెయ్యి కరిగించి అరటిపండు ముక్కలు, పంచార, యాలకుల పొడి, కొబ్బరి తరుము, జీడిపప్పు, ఎండుద్రాక్షా వేసి మూత పెట్టాలి. నాలుగైదు నిమిషాలయ్యాక దించాలి. చల్లారాక చేత్తో మెదపాలి. ఈ మిశ్రామాన్ని కావలసినంత సైజులో ఉండలుగా చేసుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు మైదాలో కాసిని నీళ్లు ఉప్పి చేర్చి గరిటెజారుగా కలుపుకోవాలి. ఈ పిండిలో అరటి పండు ఉండలను ముంచి కాగుతున్న నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి దింపేయాలి. అంతే రుచికరమైన బనానా రోల్స్ రెడీ. వీటిని అరటి పండ్లను తినని చిన్నారు సైతం చక్కగా తినేస్తారు. ఇవి పిల్లలకు బలవర్ధకమైనవి.