శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By
Last Updated : శనివారం, 29 డిశెంబరు 2018 (12:27 IST)

బొప్పాయి ఐస్‌క్రీమ్ ఎలా చేయాలో తెలుసా..?

కావలసిన పదార్థాలు:
కార్న్‌ఫ్లోర్ - 2 స్పూన్స్
చక్కెర - 1 కప్పు
పాలు - 2 కప్పులు
గుడ్లు - 2
వెనిల్లా ఎసెన్స్ - 4 చుక్కలు
బొప్పాయి గుజ్జు - 4 కప్పులు
 
తయారీ విధానం:
ముందుగా బొప్పాయి గుజ్జులో చక్కెర, కార్న్‌ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ కలపాలి. ఆ తరువాత పొయ్యి మీద ఉంచి కలుపుతూ గరిటెకు అంటుకునేవరకు ఉడికించి చల్లార్చాలి. ఆపై గుడ్లు తెల్లసొన, వెనిల్లా వేసి కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. కాస్త గట్టిపడిన తరువాత ఫ్రిజ్ నుండి బయటకు తీసి అందులో బొప్పాయి గుజ్జు వేసి కలిపి మరో గంటపాటు ఫ్రిజ్‌ ఉంచుకోవాలి. అంతే... బొప్పాయి ఐస్‌క్రీమ్ రెడీ...