సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (15:33 IST)

శవం పెట్టడానికి రవ్వంత జాగా కూడా లేదు.. రాత్రంతా అంబులెన్స్‌లోనే మృతదేహం... (Video)

deadbody in ambulance
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక అమానవీయ ఘటన జరిగింది. అద్దె ఇంటిలో ఉంటూ వచ్చిన యజమాన్ని అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే, మృతదేహాన్ని ఇంటిలోకి తీసుకెళ్ళేందుకు యజమానులు అంగీకరించలేదు. దీంతో రాత్రంతా మృతదేహాన్ని అంబులెన్స్‌లోనే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన సంతోష్ అనే నేత కార్మికుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఈయనకు భార్య శారద, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా అద్దె ఇంటిలోనే ఉంటూ వచ్చారు. అనారోగ్యంతో సంతోష్ మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లగా ఇంటి వద్ద ఉంచేందుకు ఆ ఇంటి యజమానులు అంగీకరించలేదు. 
 
సొంత ఇళ్లు లేకపోవడంతో అంబులెన్స్‌లోనే మృతదేహంతోనే రాత్రంతా భార్య శారద, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గూడు లేక.. అద్దె ఇంటిలోకి వెళ్ళలేక.. రాత్రంతా మృతదేహంతోనే అంబులెన్స్‌లో గడిపిన విషయాన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్ అయింది. దీంతో పలువురు పెద్ద మనసు చేసుకుని రూ.50 వేల వరకు ఫోన్‌పే ద్వారా కుటుంబానికి అందించారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లును కూడా ఆ కుటుంబానికి కేటాయించి, అన్ని విధాలుగా ప్రభుత్వం తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంఛార్జన్ కేకే మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.