Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మానుష్య ప్రాంతంలో కన్నబిడ్డపై దాష్టీకం.. చెప్పిన మాట వినలేదని దాడి

Written By సెల్వి
Updated: సోమవారం, 20 ఏప్రియల్ 2026 (14:11 IST)
Manchiryala
మంచిర్యాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తన ఆరేళ్ల కుమార్తె సరిగా చదవడం లేదని, మాట వినడం లేదనే సాకుతో ఆమెను బైక్‌పై ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేని సమయం చూసి, ఆ చిన్నారిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. తండ్రి కొడుతున్న దెబ్బలకు తట్టుకోలేక ఆ  పసిపాప కేకలు వేస్తూ విలవిలలాడిపోయింది. 
 
కనికరం లేని ఆ తండ్రి చిన్నారి అరుపులను పట్టించుకోకుండా తన దాష్టీకాన్ని కొనసాగించాడు. అయితే అక్కడున్న పశువుల కాపరి ఆ తండ్రిపై మండిపడ్డాడు. ఇదేంపని అంటూ నిలదీశారు. పశువుల కాపరి గట్టిగా నిలదీయడంతో భయపడిన సతీశ్, వెంటనే తన కుమార్తెను బైక్‌పై ఎక్కించుకుని అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు. 
 
అయితే, ఈ మొత్తం తతంగాన్ని సదరు పశువుల కాపరి తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్థానికులు మరియు బాలల హక్కుల సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.
About Author
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... Read More

అన్నీ చూడండి

Prakash Raj: డార్లింగ్ కృష్ణ, ప్రకాష్ రాజ్ సినిమా ఫాదర్ టీజర్ రిలీజ్

king 100: నాగార్జున పుట్టినరోజు న కింగ్ 100 మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

Mandadi teaser: విజువల్స్, బోట్ సీక్వెన్స్ తో సుహాస్, సూరి ల మండాడి టీజర్

Taapsee Pannu : అప్పుడే మేము దానిని వేడుకలా జరుపుకుంటాం : తాప్సీ పన్ను

ప్రియదర్శి.. ఇడుపు కాయితం నుంచి శ్రీలత సాంగ్ ప్రోమో రిలీజ్

తర్వాతి కథనం
Show comments