గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (08:37 IST)

సికింద్రాబాద్ - నాగ్‌పూర్‌ల మధ్య వందే భారత్ రైలు.. ప్రారంభం ఎపుడంటే..

vande bharat sleeper
తెలంగాణ రాష్ట్రానికి మరో వందే భారత్ రైలును కేటాయించారు. ఈ రైలు సికింద్రాబాద్ - నాగ్‌పూర్ ప్రాంతాల మధ్య నడుపనున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటికే పలు వందే భారత్ రైళ్లు పరుగులుపెడుతున్నాయి. తాజాగా ఐదో సెమీ హైస్పీడ్ ట్రైన్ పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ నెల 15వ తేదీన ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో ఈ రైలు సేవలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పచ్చా జెండా ఊపుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
ఈ వందే భారత్ రైలు రెండు నగారల మధ్య 578 కిలోమిటర్ల దూరాన్ని 7 గంటల 15 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. రైల్వే శాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ రైలు నాగ్‌పూర్‌లో ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్న 12.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం ఒక్క గంటకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైలు కాజీపేట్, రామగుండం, బల్లార్షా, చంద్రపూర్, సేవాగ్రామ్ స్టేషన్‌లలో మాత్రమే ఆగుతుందని అధికారులు తెలిపారు.