1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (07:07 IST)

తెలంగాణాలో నిరుద్యోగులకు శుభవార్త : గ్రూపు-1 పరీక్షల తేదీల వెల్లడి

tspsc
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గ్రూపు-1 పరీక్షల తేదీలను వెల్లడించింది. ఈ పరీక్షల షెడ్యూల్‌‍లో భాగంగా, జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ దరఖాస్తులను మార్చి 14 తేదీ వరకు కొనసాగుతుంది. 
 
రాష్ట్రంలో 563 గ్రూపు-1 పోస్టుల ప్రిలిమినరీ పరీక్షలను జూన్ 9వ తేదీన నిర్వహించనున్నట్టు టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. పేపర్ లీకేజీతో పాటు ఇతర కారణాల వల్ల గత ప్రభుత్వం 2022లో ఇచ్చిన గ్రూపు-1 నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెల్సిందే. నాటి నోటిఫికేషన్‌లో పోస్టులకు అదనంగా మరికొన్ని పోస్టులను జోడించి తాజాగా మరో గ్రూపు-1 నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుతం వీటి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ మార్చి 14వ తేదీతో ముగియనుంది. 
 
కాగా, భూగర్భజల శాఖలో వివిధ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష జనరల్ బ్యాంకు జాబితాను కూడా టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. ఈ లిస్టును వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది.