మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: సోమవారం, 21 జూన్ 2021 (18:08 IST)

కొంపముంచిన కొడుకు, ఆన్‌లైన్ పాఠం వింటానని ఫోన్ తీసుకుని లక్షా 50 వేలు హాంఫట్..?

ఆన్ లైన్ పాఠాలు వింటూ ఒక విద్యార్థి ఏకంగా లక్షా 50వేల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆన్ లైన్ గేమ్‌తో డబ్బులు సంపాదించాలన్న ఆశతో తండ్రి బ్యాంకు ఖాతాను ఖాళీ చేశాడు. మహబూబాబాద్ జిల్లా కె.సముద్రం మండలం తండాలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా ఈ స్థాయిలో డబ్బులు పోగొట్టుకోవడంతో ఆ తండ్రి లబోదిబో అంటున్నాడు.
 
ఈ నెల 17వ తేదీన వెంకయ్య ధాన్యం విక్రయింగా వచ్చిన 83 వేల రూపాయలను తన బ్యాంకు ఖాతాలో వేశారు. ఇక దాంతో పాటు రైతు బంధు, మిర్చి పంట డబ్బులను కూడా తన ఖాతాలో జమచేశాడు. తాజాగా విత్తనాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు అవసరమై బ్యాంకుకు వెళ్ళాడు.
 
అతని ఖాతాలో డబ్బు లేకపోవడంతో వెంకన్న దిగ్భ్రాంతికి గురయ్యాడు. అనంతరం బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని పరిశీలించగా ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మొత్తం లక్షా 50 వేల రూపాయలు బదిలీ అయినట్లు గుర్తించారు. బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం కావడానికి తన కొడుకే కారణమని తెలుసుకుని లబోదిబోమంటున్నాడు.