బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జూన్ 2022 (12:52 IST)

వీసీ నియామకం కోసం బాసర ట్రిబుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన

students
యూనివర్శిటీకి వైస్ ఛాన్సలర్‌ను నియమించాలని, క్యాంపస్‌లోని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాసర్ ఐఐఐటీ క్యాంపస్‌ (ట్రిబుల్ ఐటీ)లో సుమారు 8,000 మంది విద్యార్థులు మంగళవారం నిరసనలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. 
 
ట్రిబుల్ ఐటీ వర్గాల సమాచారం మేరకు విద్యార్థులు పరిపాలనా భవనం వెలుపల నిరసనలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఐఐఐటి క్యాంపస్‌ను సందర్శించే వరకు నిరసనలు కొనసాగిస్తామని వారు తేల్చిచెప్పారు.
 
విద్యార్థులు క్యాంపస్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ల్యాప్‌టాప్ అందలేదని వారు వాపోయారు. ముఖ్యంగా, వైస్ చాన్సలర్‌ను కూడా నియమించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విద్యార్థులు వాపోయారు.