ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 నవంబరు 2023 (11:23 IST)

బాసర జ్ఞానసరస్వతి ఆలయంలో పాములే పాములు..!

బాసర జ్ఞానసరస్వతి ఆలయంలో పాములు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవలే ఆలయ ప్రాంగణంలోని శ్రీదత్తాత్రేయ గుడిలో ఓ పూజారిని పాము కాటేసింది. అలాగే భక్తులకు అన్నప్రసాదం పెట్టే భోజనశాలలోనూ పాము కనిపించింది. ఆలయ సిబ్బంది సమాచారమివ్వడంతో స్నేక్‌ క్యాచర్‌ వచ్చి పామును బంధించాడు.

తాజాగా జ్ఞానసరస్వతి ఆలయంలో మరో పాము కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. తెల్లవారుజామున ఆలయానికి వెళ్లే పూజారులు హోంగార్డ్స్‌ను వెంటబెట్టుకుని వెళ్లాలని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూచించారు.