మంగళవారం, 12 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 జనవరి 2023 (12:55 IST)

హైదరాబాద్ బిర్యానీలో పోషకాలు.. అందుకే ఆ గుర్తింపు

హైదరాబాద్ అంటేనే బిర్యానీకి పెట్టింది పేరు. హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక స్థానం వుందన్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బిర్యానీకి మంచి గుర్తింపు లభించింది. 
 
ఆఫ్రికన్ జనరల్ ఆఫ్ ఫుడ్స్ సైన్ అండ్ టెక్నాలజీ పలు ఆహార పదార్థాలపై జరిపిన పరిశోధనలో హైదరాబాద్ బిర్యానీ హెల్తీ ఫుడ్‌గా గుర్తింపు సంపాదించుకుంది. 
 
హైదరాబాద్ బిర్యానీలో అనేక పోషకాలు ఉన్నట్లు గుర్తించారు. బిర్యానీలో కోడిగుడ్డు, మాంసం, మసాలాలు వాడటం ద్వారా ఆరోగ్యం చేకూరుతుంది. ఇందులో కలిపే పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయని తేల్చారు.