మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 మే 2021 (11:56 IST)

కరోనా దెబ్బకు కొండ దిగిన చికెన్ ధర

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వణికిస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అలాగే, మృతుల సంఖ్య కూడా అధికంగానే వుంది. అధికారులు చెప్పే లెక్కలకు వాస్తవ లెక్కలకు ఏమాత్రం పొంతనలేకుండా ఉన్నాయి. ఈ వైరస్ దెబ్బకు ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. దానికితోడు దుకాణాలన్నీ మధ్యాహ్నం తర్వాత మూసివేస్తున్నారు. దీంతో చికెన్ ధరలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. 
 
అదేసమయంలో చికెన్ ఉత్పత్తి కూడా పెరిగిపోయింది. దీంతో ధరలు క్రమంగా కిందికి దిగివస్తున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలో వంద రూపాయలకు పైగా కోడి మాంసం ధర తగ్గిపోయింది. ఏప్రిల్‌లో రూ.270 దాకా వెళ్లి కిలో చికెన్‌ ధర.. ఈనెలలో అది రూ.150కు పడిపోయింది. నగరంలో ప్రస్తుతం లైవ్‌కోడి ధర రూ.100 పలుకుతోంది. గత నెలలో చికెన్‌ ధర కిలో అత్యధికంగా రూ.270, అత్యల్పంగా రూ.220 ఉండింది. అలాగే ఈనెల ఒకటిన రూ.144, నాలుగున రూ.145, ఆరో తేదీన రూ.150 పలికింది.