ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (13:20 IST)

ఢిల్లీలో తెరాస ఆఫీసుకు భూమిపూజ - పాల్గొననున్న కేసీఆర్ - కేటీఆర్

దేశ రాజధాని ఢిల్లీలో తెరాస పార్టీ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం గురువారం మ‌ధ్యాహ్నం ఢిల్లీలో భూమి పూజ జరుగనుంది. ఈ విషయాన్ని మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి వెల్లడించారు. 
 
ఇందుకోసం బుధ‌వారం ఉద‌య‌మే ఢిల్లీకి వెళ్లిన మంత్రులు ప్ర‌శాంత్ రెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, మ‌ల్లారెడ్డి, ఎంపీ మాలోతు క‌విత‌, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు ప‌లువురు వ‌సంత్ విహార్‌లో తెరాస పార్టీ ఆఫీసుకు కేటాయించిన స్థ‌లాన్ని ప‌రిశీలించారు.
 
ఈ సంద‌ర్భంగా మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి మాట్లాడారు. పార్టీ ఆఫీసు నిర్మాణ భూమి పూజ కార్య‌క్ర‌మం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జ‌ర‌గ‌నుంద‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఏ ద‌క్షిణాది పార్టీకి ఢిల్లీలో కార్యాల‌యం లేదు. ఢిల్లీలో ఆఫీసు ఏర్పాటు చేసుకుంటున్న తొలి ద‌క్షిణాది పార్టీ మాదే అని మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి గుర్తుచేశారు.