సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2019 (09:05 IST)

యురేనియం తవ్వకాలు చేపట్టొద్దు: ఉత్తమ్

నల్లమలలో యురేనియం నిక్షేపాల వెలికితీతను నిలిపివేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్‌వోసీని వెనక్కి తీసుకోవాలన్నారు.

ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉత్తమ్ లేఖ రాశారు. ప్రభుత్వ నిర్ణయంతో చెంచులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. యురేనియం తవ్వకాలతో కాలుష్యం పెరిగే ప్రమాదముందన్నారు.

కొన్ని తరాల పాటు జనజీవనం అస్తవ్యస్థమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అటవీజాతులు, పర్యావరణాన్ని కాపాడాలని సీఎం కేసీఆర్‌ను ఉత్తమ్ కోరారు.