బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (09:53 IST)

న్యాయవాదుల హత్యకేసులో అదుపులోకి నలుగురు

హైకోర్టు న్యాయవాదుల హత్య కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కుంటశ్రీనివాస్‌, అక్కపాక కుమార్‌, వసంతరావు, చిరంజీవిని పోలీసులు విచారిస్తున్నారు. పెద్దపల్లి మండలంలోని కల్వచర్ల వద్ద గట్టువామన్‌రావు, నాగమణిలు పట్టపగలే దారుణ హత్యకు గురైన విషయం విధితమే.

వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పైన పేర్కొన్న నలుగురినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులను ఈరోజు రాత్రి మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది.

ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుంట శ్రీనివాస్‌ను టిఆర్‌ఎస్‌ నుండి సస్పెండ్‌ చేసినట్లు ఆపార్టీ ప్రకటించింది. మరోవైపు ఈ హత్య వెనుక రాజకీయ కోణం లేదని పోలీసులు చెబుతున్నారు.