తెలంగాణలో మరోసారి వర్షాలు.. హైదరాబాదుకు ఎల్లో అలెర్ట్
తెలంగాణ మరోసారి వర్షాలు ప్రజలను ఇబ్బంది పెట్టనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది
అదే సమయంలో హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాజధాని నగరంలో రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఒక్కసారిగా వచ్చిన వర్షంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
గురువారం రాత్రి కూడా ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. ముఖ్యంగా హయత్ నగర్, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సరూర్ నగర్, కాప్రా ప్రాంతాల్లో భారీ వర్షంతో ఆ ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా గురువారం వర్షం కురిసింది. వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి నలుగురు చనిపోయారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ఈదమ్మబండ తండాలో పిడుగు పాటుకు ఇద్దరు మృతి చెందారు.