గురువారం, 31 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 జనవరి 2022 (12:07 IST)

కరీంనగర్‌లో భారీ వర్షాలు: పడిపోయిన 70 అడుగుల ఎత్తైన భారీ కటౌట్

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. కరీంనగర్ పట్టణంలోని గీతాభవన్ చౌరస్తాలో ఉన్న ఓ పెద్ద హోర్డింగ్ జోరు గాలివానకు కుప్పకూలిపోయింది. రాముడి పట్టాభిషేకం ఆవిష్కరించేలా ఏర్పాటు చేసిన 70 అడుగుల ఎత్తైన భారీ కటౌట్ గాలివానకు పడిపోయింది. 
 
ఫిబ్రవరిలో జరగబోయే బ్రహ్మోత్సవాల్లో రాముడి పట్టాభిషేకాన్ని ఆవిష్కరించేలా సుమారు రూ.45 లక్షలు వెచ్చించి ఈ భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఇక కుండపోత వర్షంతో కరీంనగర్ పట్టణంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. 
 
రహదారులపై వరదనీరు వచ్చి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, రామడుగు, మానకొండూరు, పెద్దపల్లి, శంకరపట్నం మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది.