మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (10:51 IST)

రికార్డ్ స్థాయిలో మూసీ నదికి వరద పోటెత్తింది.. వరద ఇంకా పెరిగితే..?

Musi River
భారీ వర్షాల కారణంగా మూసీ నదికి వరద పోటెత్తింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నదికి వరద పోటెత్తింది. గతంలో ఎప్పుడూ లేనంతగా భారీ వరద నీరు మూసి ప్రాజెక్టులోకి చేరుతుంది. రికార్డ్ స్థాయిలో వరద నీరు పోటెత్తినట్టు అధికారులు చెప్తున్నారు. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి హఠాత్తుగా వరద నీరు పెరిగినట్టు అధికారులు అంటున్నారు. 
 
మూసీకి వరదనీరు పెరగడంతో మంత్రి జగదీశ్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సీఈవోతో సహా ముఖ్య అధికారులంతా ప్రాజెక్టు వద్ద ఉండాలని ఆదేశించారు. 
 
మూసి నది దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా అధికారులకు మంత్రి ఆదేశించారు. మూసి నది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 646.70 అడుగుల నీటిమట్టం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని వరద ఇంకా పెరిగితే రత్నపురం వైపున కట్టకు గండికొట్టే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం.