శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (23:48 IST)

హైదరాబాద్‌ ఇంజనీర్‌కు ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ 2021 అవార్డు

హైదరాబాద్‌కు చెందిన రోబోటిక్స్ ఇంజనీర్ అవినాష్ గండి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ స్మార్ట్ అల్ట్రా జెర్మీసిడల్ ఇర్రాడియేషన్ డివైస్ - ఇన్ఫినిటీ 360 ను రూపొందించారు. ఈ పరికరం కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. వివిధ వాట్ల, ఎనిమిది యూవీ-రే ఉద్గార లైట్లను కలిగి ఉన్న ఈ పరికరం ఒక నిమిషం నుండి ఐదు నిమిషాల్లో ఒక గదిని క్రిమిసంహారకం చేస్తుంది. 
 
మొబైల్ అనువర్తనంతో దీన్ని ఆన్ చేయొచ్చు. తద్వారా ఎవరూ నేరుగా యూవీ కాంతికి గురికాకుండా ఉంటారు. మానవ కదలికను గుర్తించడానికి దీనికి నాలుగు సెన్సార్లు ఉంటాయి. ఏదైనా కదలిక ఎదురైతే ప్రమాదకర యూవీ కిరణాలు మనిషి మీద పడకుండా స్విచ్ ఆఫ్ అవుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా వినూత్న ఆవిష్కరణలు చేసిన 10 మంది వ్యక్తులు ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్‌ అవార్డులు అందుకున్నారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన అవినాష్ గండి టాప్-10లో నిలిచారు.
 
అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన గౌరవ్ నరుల, దర్శన్ ఎమ్, రాహుల్ పాటిల్, గణేష్ డి.ఎన్, మంజునాథ్ డి, మృత్యుంజయ డి.కె, మురళీకృష్ణ కె, మలలూర్ వి అహిపతి, రుబిని పుల్లైడి, సుచన్ ఖడే, జితేష్ కుమార్ యాదవ్, సంజన్ పిబి, మెర్విన్ మాథ్యూస్, కాంచన ఖతన, శంషాంక్ ఎస్ కాంబ్లె, దృష్టి హన్స్ ల ఆవిష్కరణలు మొదటి పది స్థానాల్లో నిలిచాయి.