శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2023 (20:16 IST)

నృత్యం చేస్తూ గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి

deadbody
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. నృత్యం చేస్తూ ఓ ఇంటర్ విద్యార్థిని కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ప్రదీప్తినిగా గుర్తించారు. స్థానిక గంగాధర ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఇంటర్ ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఏకధాటిగా అరగంట పాటు నృత్యం చేసి కుప్పకూలిపోయింది. ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ప్రదీప్తి స్వస్థలం గంగాధర మండలం వెంకటాపల్లి. గుండెపోటు కారణంగానే ఆ విద్యార్థిని చనిపోయివుంటుందని వైద్యులు చెబుతున్నారు. 
 
అగ్నికి ఆహుతైన ఆత్మకూరు ఆర్టీసీ డిపో బస్సు  
 
చెన్నై నగర శివారు ప్రాంతమైన రెడ్‌హిల్స్ వద్ద గురువారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒకటి మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చెన్నై నుంచి ఆత్మకూరుకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సు చెన్నై మాధవరం బస్టాండు నుంచి గురువారం బయలుదేరింది. బస్సులో 47 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్, కండక్టర్ ఉన్నారు. ఈ బస్సు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రెడ్‌హిల్స్ వద్ద వెళుతుండగా, బస్సు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపేసి, అందులోని ప్రయాణికులను కిందకు దించేశాడు. 
 
ఇంజిన్ నుంచి మటలు ఒక్కసారిగా చెలరేగడంతో ప్రయాణికులు బిగ్గరగా కేకలు వేసుకుంటూ ప్రాణభయంతో పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇంతలో మంటలు బస్సు మొత్తానికి వ్యాపించడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.