ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 23 జూన్ 2021 (22:47 IST)

రూ. 10 లక్షలతో లొంగిపోయిన మావోయిస్టు కమాండర్

మావోయిస్టులపై ఇటీవల వరుసగా దాడులు జరుగుతున్న క్రమంలో కొందరు లొంగుబాటు దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ ప్లాటూన్ కమాండర్ అక్కడి పోలీసుల ముందు లొంగిపోయారు. ఎక్స్‌టెన్షన్ ప్లాటూన్ కమాండర్‌గా పని చేస్తున్న దివాకర్ అలియాస్ కిషన్ కవర్ధ ఎస్పీ శాలభ్ సిన్హా ఎదుట లొంగిపోయారు.
 
ఆ సమయంలో దివాకర్ వద్ద రూ.10 లక్షల నగదు, నాలుగు వందల రౌండ్ల బుల్లెట్లు ఉన్నాయి. ప్లాటూన్ కమాండర్ లొంగిపోయిన విషయాన్ని మధ్యప్రదేశ్ పోలీసులు అధికారికంగా వెల్లడించారు.