ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (20:18 IST)

స్ఫూర్తిమంత‌మైన త‌ల్లీకూతుళ్లు.. కవిత వీడియో వైరల్

Daughter-mother
హైదరాబాద్‌కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ ఆస‌క్తిక‌ర వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోను క‌ల్వ‌కుంట్ల క‌విత త‌న కారులోంచి తీయడం విశేషం. 
 
ఆ వీడియోలో హైదరాబాద్ శివారులోని నాన‌క్ రామ్ గూడ‌లో ఓ త‌ల్లి త‌న కూతురిని స్కూట‌ర్‌పై బ‌డికి తీసుకెళుతోంది. ఆ మ‌హిళ‌తో పాటు ఆమె కూతురు కూడా హెల్మెట్ పెట్టుకుని వుంది. 
 
ఈ వీడియోను కవిత ట్విట్టర్లో పోస్టు చేస్తూ.. 'స్ఫూర్తిమంత‌మైన త‌ల్లీకూతుళ్లు.. నాన‌క్ రామ్ గూడ చౌర‌స్తా వ‌ద్ద ఈ రోజు నేను ఈ విష‌యాన్ని గ‌మ‌నించా‌ను. హెల్మెట్ పెట్టుకోండి, సుర‌క్షితంగా ఉండండి' అని క‌విత పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.