1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (19:32 IST)

భర్తపై కోపంతో బ్లేడ్‌తో కన్నకొడుకును గొంతు కోసి చంపేసింది!

భార్యభర్తల మధ్య గొడవ తీవ్ర విషాదాన్ని నింపింది. కొడుకు పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలనే విషయంపై భార్యభర్తలు మధ్య గొడవ పెరిగి పెద్దదైంది. భర్త మీద కోపంతో కొడుకును బ్లేడ్‌తో గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత విషయాన్ని భర్తకు చెప్పి ఆమె కూడా బ్లేడ్‌తో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 
 
వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలోని ఫుల్ మామిడిలో చిన్నారి గొంతు కోసి తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుమారుడి పుట్టినరోజు నిర్వహణపై భర్తతో గొడవ పడిన భార్య మూడేళ్ల చిన్నారి గొంతు కోసి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పులిమామిడి లో చోటు చేసుకుంది. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం ..గ్రామానికి చెందిన రమేష్, మంజుల దంపతులకు నలుగురు సంతానం. 
 
వీళ్ళ జీవితం సాఫీగా సాగేది కానీ కొంతకాలంగా మంజుల మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తుంది. చిన్న చిన్న విషయాలకు భర్త తో పాటు వారి కుటుంబ సభ్యులతో గొడవ పడుతుంది. పెద్ద కుమారుడు శివ కుమార్ పుట్టిన రోజు వేడుకల ఏర్పాటు విషయంలో భార్య భర్తల మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన మంజుల తన భర్త షేవింగ్ చేసుకుంటున్న బ్లడ్ తో చిన్న కుమార్తె శివాని(3) గొంతు కోసింది.
 
ఈ విషయం భర్తకు చెప్పి ఆమె గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.