గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (19:46 IST)

సురభి బాబ్జి ఇకలేరు - అనారోగ్యంతో కన్నుమూత

deadbody
సురభి బాబ్జిగా గుర్తింపు పొందిన సురభి నాటక కళాకారుడు నాగేశ్వర రావు కన్నుమూశారు. ఆయనకు వయసు 76 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో  బాధపడుతూ వచ్చిన ఆయన గురువారం హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో ఉన్న తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. 
 
నాటకరంగంలో తొలి పద్మశ్రీ అవార్డును అందుకున్న కళాకారుడుగా గుర్తింపు పొందిన బాబ్జికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఈయన నటించిన సురభి నాటకంతో మంచి గుర్తింపు రావడంతో ఆ పేరుతోనే స్థిరపడిపోయారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ, నాటకరంగ కళాకారులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.