శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (13:46 IST)

ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన అక్కాచెల్లెళ్లపై అత్యాచారం

gang rape
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. అక్కాచెల్లెళ్లు అత్యాచారానికి గురయ్యారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో వరుస అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
 
ఈ నేపథ్యంలో ఇపుడు సికింద్రాబాద్‌లో మైనర్‌ అక్కాచెల్లెళ్లపై ఇద్దరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రేమ పేరుతో మోసం చేసి రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నట్లు బాలికల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు నవాజ్‌ (21), ఇంతియాజ్‌ (21)ను అంబర్‌పేట్‌ వాసులుగా గుర్తించారు. అక్క, చెల్లెల్ని ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకొని నిందితులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.