సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

నేడు వరంగల్‌కు రాహుల్ గాంధీ - భారీ బహిరంగ సభ

rahul gandhi
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే యేడాది ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచి కసరత్తులు మొదలుపెట్టాయి. ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీ ఒక్క అడుగు ముందుకేసి వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమైంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకుసాగుతోంది.  
 
రాష్ట్రంలో తమ గత కీర్తిని తిరిగి పొందటానికి కాంగ్రెస్ నాయకులు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం తెలంగాణను వస్తున్నారు. ఈ రోజు వారంగల్‌లోని ఆర్ట్ కాలేజీ మైదానంలో జరగనున్న 'రైతు సంఘర్షణ' సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. 
 
ఈ సమావేశాని భారీ సంఖ్యలో జనసమీకరణ చేపట్టారు. రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాహుల్ గాంధీ ప్రధానంగా ప్రస్తావించి, అధికారంలోకి వస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్న భరోసా ఇవ్వనున్నారు. మెరుగైన ఎంఎస్‌పి, వరి సేకరణను రైతుల కోసం రాహుల్ గాంధీ డిక్లరేషన్ జారీ చేస్తారని వర్గాలు తెలిపాయి.