గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 మార్చి 2022 (16:58 IST)

ఆర్టీసీ బస్సులో ఆర్ఆర్ఆర్ టీమ్... సజ్జనార్‌పై ప్రశంసల జల్లు

'ఆర్ఆర్ఆర్' మానియాను ఆర్టీసీ ఉపయోగించుకుంది. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ చాలా హ్యాపీగా ఫీలైంది. ఆర్ఆర్ఆర్ టీమ్‌కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఐపీఎస్ ప్రత్యేక ఏసీ బస్సు ఏర్పాటు చేశారు. 
 
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అనే మెసేజ్ ఇవ్వడంతో పాటు వారికి ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయడం పట్ల ప్రశంసలు అందుకుంటున్నారు సజ్జనార్. 
 
ఇక అసలు సంగతి ఏంటంటే?  ‘ఆర్ఆర్ఆర్’ టీం సభ్యులు ఈ ప్రత్యేక బస్సులోనే థియేటర్స్‌ను విజిట్ చేయనున్నారు. 
 
తెలంగాణ సర్కారు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ముందు నుంచి బాగానే సహకరిస్తుంది. నిరంతరం తమకు సహకరించడాన్ని గౌరవిస్తున్నామని ఈ సందర్భంగా హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ రాజమౌళి ట్వీట్ చేశారు.