ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 23 జనవరి 2021 (16:46 IST)

తప్పదు, నడి ఎండల్లో తెలంగాణ విద్యార్థులు పరీక్షలు రాయాల్సిందేనా?

కరోనా మహమ్మారి అందరి జీవితాలను తల్లకిందులు చేసేసింది. ఇక ఆడుతూపాడుతూ హాయిగా పాఠశాలలకెళ్లి చదువుకోల్సిన విద్యార్థులు ఇళ్లకే పరిమితమైపోయారు. ఆన్ లైన్ క్లాసులకే పరిమితమవ్వాల్సి వచ్చింది.
 
ఇక అసలు విషయానికి వస్తే... తెలంగాణ రాష్ట్రం జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు తెరుస్తారు. మే 17 నుంచి 26 దాకా పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత మే 27 నుంచి జూన్ 13 వరకూ వేసవి సెలవులు వుంటాయి. ఈ మేరకు ప్రతిపాదిత షెడ్యూల్ ను ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. దాదాపు ఇదే ఖరారయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.