ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2020 (15:07 IST)

పెండింగ్‌లో ఉన్న పదో తరగతి పరీక్షలు రద్దు : సీబీఎస్ఈ

సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ (సీబీఎస్ఈ) అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌తో పాటు లాక్‌డౌన్ కారణంగా ఇకపై జరగాల్సిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. 
 
విద్యార్థులు కరోనా వైరస్ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు వీలుగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ పరీక్షలను ఈశాన్యభారతంలో ఈ పరీక్షలను పూర్తిగా రద్దు చేయగా, ఢిల్లీలో మాత్రం ఈ పరీక్షలను తర్వాత జరుగుతాయని పేర్కొంది. 
 
అంతేకాకుండా, 2020 విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రతిభపాఠవాలకు అనుగుణంగా గ్రేడ్ ఇవ్వనున్నట్టు సీబీఎస్ఈ పేర్కొంది. కాగా, ఇప్పటికే ఒకటో తరగతి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసిన విషయం తెల్సిందే.