గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: మంగళవారం, 3 ఆగస్టు 2021 (14:27 IST)

పంచెలో దూరిన పాము, ఏం చేశాడంటే?

కరీంనగర్ జిల్లా జంగంపల్లి గ్రామంలో విష సర్పం హల్ చల్ చేసింది. రాజయ్య అనే వ్యక్తి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా ఒక్కసారిగా వచ్చిన పాము అతన్ని ఎటూ కదలనివ్వకుండా కాళ్ళను చుట్టేసింది.
 
పాము చుట్టేయడంతో రాజయ్య ఏ మాత్రం భయపడకుండా పాము తలభాగాన్ని గట్టిగా పట్టుకుని మరొకరి సాయంతో పామును మెల్లగా వదిలించుకున్నాడు. అనంతరం పామును కర్రతో కొట్టి చంపాడు.
 
రాజయ్య దైర్యాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రెండు నిమిషాల పాటు పాము పంచి లోపలే ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే రాజయ్య ఏ మాత్రం భయపడకుండా పామును పట్టుకుని కొట్టి చంపేశాడు.