ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ తెగలకు ఇస్తున్న రిజర్వేషన్లను పది శాతానికి పెంచింది. ప్రస్తుతం తెలంగాణాలో ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఇపుడు దీన్ని పది శాతానికి పెంచారు. అందుకు అనుగుణంగా సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సవరణ చేసింది. రోస్టర్ పాయింట్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. పైగా, ఈ రిజర్వేషన్లను పది శాతానికి పెంచడంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రతి పదో ఉద్యోగ నియామకంలోనూ ఒక ఉద్యోగం ఎస్టీలకు దక్కనుంది.
ఎస్టీలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌ను సవరించింది. అంతేకాకుండా, ఉద్యోగాల భర్తీకి సంబంధించి రోస్టర్ పాయింట్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగామ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం ఇకపై ప్రభుత్వ ఉద్యగాల్లో మరింత మేరకు గిరిజనలకు లబ్ధి చేకూరనుంది.