శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (12:23 IST)

పాక్‌ చెర నుంచి తెలుగు యువకుడు విడుదల

పాక్‌ భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్‌ విడుదలయ్యాడు. మంగళవారం ప్రశాంత్‌ హైదరాబాద్‌కు చేరుకోనున్నాడు. మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్న ప్రశాంత్‌ 2017 లో సీజర్‌ లాండ్లో తన ప్రియురాలిని కలవడానికి వెళుతున్న క్రమంలో పాక్‌కు భద్రతా దళానికి చిక్కాడు.

ఎలాంటి వీసా, పాస్‌పోర్టు లేకుండా పాక్‌ భూభాగంలో అడుగుపెట్టడంతో ప్రశాంత్‌ను పాక్‌ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నారు. 2019లో తన కుమారుడిని రప్పించే ప్రయత్నం చేయాలంటూ సైబరాబాద్‌ సిపి సజ్జనార్‌ను ప్రశాంత్‌ తండ్రి బాబురావు కలిశారు.

విదేశాంగ శాఖ సహకారంతో ప్రశాంత్‌ను తిరిగి స్వదేశానికి రప్పించారు. ఇంతకాలం పాక్‌లోనే ఉన్న ప్రశాంత్‌ను తాజాగా వాఘా సరిహద్దులో భారత్‌కు పాక్‌ అధికారులు అప్పజెప్పారు. ప్రశాంత్‌ విడుదలతో అతని కుటుంబం ఆనందంలో మునిగి తేలుతోంది.