శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 మే 2021 (19:10 IST)

ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి విద్యుత్ వైర్లు పట్టుకున్నాడు.. భార్య డబ్బు ఇవ్వలేదని..?

ఓ వ్యక్తి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి హైటెన్షన్ విద్యుత్ వైర్లను పట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మలక్‌పేట సైదాబాద్‌లోని అక్బర్ బాగ్ కాలనీలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. దిల్‌కుషా ఫంక్షన్ హాలు సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి ఈ దారుణానికి పాల్పడ్డాడు. మద్యం కోసం భార్యతో కొట్లాడి ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి విద్యుత్ వైర్లు పట్టుకున్నాడు. దీంతో విద్యుదాఘాతంతో వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. 
 
మృతుడు ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు మద్యానికి బానిసై.. డబ్బుల కోసం భార్యతో గొడవ పడిన అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.