సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 మార్చి 2022 (18:01 IST)

జులై రెండో వారం నుంచి ఎంసెట్, ఈసెట్ పరీక్షలు

జులై రెండో వారం నుంచి ఎంసెట్, ఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌ను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. 
 
జులై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్‌ పరీక్షలు జరగనున్నాయి. 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్, 14,15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
 
తెలంగాణలో వ్యవసాయ, ఇంజినీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్.. అదేవిధంగా పీజీలో ప్రవేశం కోసం నిర్వహించే ఈసెట్ పరీక్షలను నిర్వహిస్తారు.
 
ఈ పరీక్షా తేదీలను మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఇందులో భాగంగా జులై 13న ఈసెట్‌ నిర్వహించననున్నట్లు ప్రకటన విడుదల చేశారు. .