శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (11:25 IST)

బండిగారూ... హైదరాబాద్‌లో కాదు ఢిల్లీలో మిలియన్ మార్చ్ చేయండి..

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు బహిరంగ సవాల్ విసిరారు. మిలియన్ మార్చ్ నిర్వహించాల్సిన ప్రాంతం హైదరాబాద్ కాదని ఢిల్లీ అని సూటిగా సుత్తిలేకుండా చెప్పారు. 
 
యాదగిరిగుట్టలో నిర్వహించిన టీఆర్ఎస్, తెరాస యువజన విభాగం ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ, వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 15 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దేశంలోని అన్ని ఖాళీ పోస్టుల భర్తీకి ఒక ట్రైమ్ ఫ్రేమ్‌ను ప్రకటించాలని కోరారు. 
 
ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీలో తెరాస ప్రభుత్వంపై బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలకు ధీటుగా హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. నిరుద్యోగు యువత గురించి బండి సంజయ్ ఆందోళన చెందుతుంటే, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి తన పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఆయన ఢిల్లీలో మిలియన్ మార్చ్ చేయాలని డిమాండ్ చేశారు.