శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (14:09 IST)

ఎప్సీడీఎస్సీలో 1601 పోస్టుల భర్తీకి సన్నాహాలు

jagadish reddy
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ (టీఎస్ డీఎస్పీసీఎల్)లో 1601 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ మేరకు ఆ సంస్థ సీఎండీ రఘుమా రెడ్డిని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశించారు. 1553 జూనియర్ లైన్‌మెన్, 48 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. 
 
ప్రస్తుతం రబీ సీజన్‌, రాబోయే ఎండాకాలంలో నిరంతరం విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర విద్యుత్ సంస్థలు తీసుకుంటున్న చర్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి ఆ శాఖ అధికారులతో ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏటా రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ పెరిగిపోతున్న విషయం తెల్సిందే. 
 
గత యేడాది రబీ సీజన్‌లో 14160 మెగావాట్లకు చేరింది. ఎన్నడూ లేని రీతిలో గత డిసెంబరులో 30న  సైతం 14017 మెగావాట్ల మేరకు  విద్యుత్ డిమాండ్ నెలకొంది. వచ్చే వేసవిలో ఇది 15500 మెగావాట్ల వరకు డిమాండ్ అవకాశం ఉంది. 
 
మరోవైపు, తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు త్వరలోనే పీఆర్సీ ఇస్తామని మంత్రి జగదీశ్ వెల్లడించారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐకాస కన్వీర్ ఎన్.శివాజీ నేతృత్వంలో పలువురు మంగళవారం మంత్రిని కలిసి పీఆర్సీపై విన్నవించారు. వారి విన్నపంపై మంత్రి స్పందించారు.