1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 మే 2021 (17:58 IST)

"అఖండ''లో సీనియర్ హీరోయిన్.. బాలయ్య కోసం..?

సినీ లెజెండ్ బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అవకాశం వచ్చిందని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అఖండ సినిమాల్లో బిజీగా ఉన్నా బాలయ్య.. ఈ సినిమాలో రెండు పాత్రలతో కనిపించనున్నాడు. 
 
ఇక ఈ సినిమా టీజర్ విడుదల కాగా నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను మే 28న విడుదల చేయడానికి సినీ బృందం ఇదివరకే ప్రకటించగా.. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడింది.
 
ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. యదార్థ ఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. 
 
మరో విషయం ఏంటంటే ఈ సినిమాలో కూడా బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కన్పించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఫ్యాక్షనిస్టు, పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ తో పాటు మరో సీనియర్ హీరోయిన్ నటించనుందట.
 
బాలయ్య సరసన ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శృతిహాసన్ అని సమాచారం అందగా.. మరో సీనియర్ హీరోయిన్ మీనా ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మీనా బాలయ్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాలయ్య జంటగా నటించనున్నట్లు తెలిసింది. ఇక ఈ ప్రాజెక్టు కోసం మీనాను సంప్రదించగా.. తను కూడా ఓకే అన్నట్లు తెలుస్తోంది.