ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By srinivas
Last Modified: శనివారం, 11 ఆగస్టు 2018 (19:56 IST)

సూప‌ర్ స్టార్ మహేష్ బాబుతో అల్లు అర‌వింద్ సినిమా చేస్తున్నారా?

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పైన ప‌లు భారీ చిత్రాల‌ను నిర్మించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు సెన్సేష‌నల్ మూవీని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... రామాయ‌ణం సినిమా నిర్మించ‌

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పైన ప‌లు భారీ చిత్రాల‌ను నిర్మించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు సెన్సేష‌నల్ మూవీని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... రామాయ‌ణం సినిమా నిర్మించ‌నున్న‌ట్టు అల్లు అర‌వింద్ అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు కానీ... ఆ ప్రాజెక్ట్ ఏమైందో ఇప్ప‌టివ‌ర‌కు అప్‌డేట్ లేదు. తాజాగా మ‌రో భారీ సినిమా నిర్మించేందుకు ప‌క్కా ప్లాన్ రెడీ చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది.
 
ఈసారి సూప‌ర్ స్టార్‌తో మూవీ ప్లాన్ చేస్తున్నార‌ట‌. అవును.. సూపర్ స్టార్ మ‌హేష్ బాబుతో అల్లు అర‌వింద్ ఓ భారీ సినిమా నిర్మించాల‌నుకుంటున్నార‌ట‌. ఈ సినిమాకి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం సందీప్ రెడ్డి, అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ చేస్తున్నారు. మ‌హేష్ బాబు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హ‌ర్షి మూవీ చేస్తున్నారు. ఆ త‌ర్వాత సుకుమార్‌తో సినిమా చేయ‌నున్నాడు. దీని తర్వాత సందీప్‌తో సినిమా స్టార్ట్ కానుంద‌ని స‌మాచారం. మ‌రి... మ‌హేష్ - సందీప్ రెడ్డి మూవీని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్లో  అల్లు అర‌వింద్ నిర్మిస్తే సంచ‌ల‌న‌మే..!