శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2023 (12:53 IST)

రష్మిక అనుకుంటే సాయిపల్లవి దక్కింది!

Sai Pallavi
Sai Pallavi
నాచురల్‌ నటుడు నాని అయితే నాచురల్‌ నటిగా కీర్తిసురేష్‌, సాయిపల్లవి, రష్మిక పేర్లు వినిపిస్తుంటాయి. ఇప్పటికే వారు బిజీగాకా, ప్రస్తుతం సాయిపల్లవి కాస్త స్పీడ్‌ తగ్గించింది. ఆమెకు బాలీవుడ్‌ ప్రవేశం చేయాలని వుండేది. ఫిదా సినిమాను బాలీవుడ్‌లో నేటివిటీకి అనుగుణంగా రీమేక్‌ చేయాలని చూస్తే శేఖర్‌ కమ్ములకు తీరికలేక రిజక్ట్‌చేశారని సమాచారం. అయితే ఇప్పుడు అందులో నటించిన సాయిపల్లవికి ఓ ఛాన్స్‌ దక్కిందిబాలీవుడ్‌లో.
 
తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ఖాన్‌ కొడుకు జునైద్‌ ఖాన్‌తో నటించడానికి సాయిపల్లవిని ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. ముందుగా రష్మికను అనుకున్నాడట దర్శకుడు సునీల్‌ పాండే. కానీ తను చాలా బిజీగా వుండడంతో డేట్స్‌ కుదవరని మేనేజర్‌ చెప్పడంతో సాయిపల్లవికి ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. మరి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బాలీవుడ్‌ ఎంట్రీతో సాయిపల్లవి ఎంత క్రేజ్‌ తెచ్చుకుంటుందో చూడాలి.