బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2017 (13:03 IST)

ప్రభాస్‌ ''సాహో''లో మందిరాబేడీ.. నెగటివ్ క్యారెక్టర్లో కనిపిస్తుందట?!

బాహుబలి సినిమాకు తర్వాత ప్రభాస్ నటిస్తున్న ''సాహో'' చిత్రంలో మందిరాబేడీ నటిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ మాజీ హీరోయిన్ మందిరాబేడీ తాజాగా ఎంటర్ అయ్యింద

బాహుబలి సినిమాకు తర్వాత ప్రభాస్ నటిస్తున్న ''సాహో'' చిత్రంలో మందిరాబేడీ నటిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ మాజీ హీరోయిన్ మందిరాబేడీ తాజాగా ఎంటర్ అయ్యింది. ఇందులో ప్రతినాయకిగా మందిరాబేడీ కీలక పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. 
 
నీల్ నితిన్ ముకేష్ ప్రతినాయకుడిగా నటిస్తోంది. వీరితో పాటు ఐదుగురు బాలీవుడ్ స్టార్లు సాహోలో నటిస్తున్నారు. జంగీ పాండే, జాకీ ష్రాఫ్, మకేష్ మంజేకర్, మందిరా బేడీ, ఆనంద్‌లు సాహోలో కమిట్ అయ్యారు. హైదరాబాద్, ముంబై, అబుదాబి వంటి ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ మరో రెండు నెలల్లోపు ప్రారంభం కానుంది. మందిరాబేడీ నెగటివ్ క్యారెక్టర్‌లో సాహోలో కనిపించారని.. హైదరాబాదులో గతవారం కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.