శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జనవరి 2020 (17:41 IST)

మా ఇద్దర్నీ విడదీయొద్దు... ప్రాధేయపడుతున్న కోలీవుడ్ ప్రేమజంట

పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ప్రేమికుల్లో హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌ ముందువరుసలో ఉన్నారు. అయితే, ఈ ప్రేమ జంటపై ఈ మధ్యకాలంలో లేనిపోని పుకార్లు వస్తున్నాయి. ఈ ప్రేమ జంట విడిపోయినట్టు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, విఘ్నేష్ శివన్ పెళ్లి ప్రస్తావన తీసుకునిరావడంతో నయనతార నో చెప్పడంతో ఈ విభేదాలు తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. దీంతో నయనతార - విఘ్నేష్‌ల ప్రేమ విఫలమైనట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. 
 
ఈనేపథ్యంలో తమ ప్రేమ బంధంపై వస్తున్న పుకార్లకు ఈ ప్రేమ జంట చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. ఇందులోభాగంగా, వారిద్దరూ కలిసి దిగిన ఫోటోను విఘ్నేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో షేర్ చేశారు. అలాగే, తామిద్దరూ చాలా సంతోషంగా ఉన్నాని ఓ అవార్డు ఫంక్షన్‌లో పరోక్షంగా నయనతార స్పందించింది. కాగా, వీరిద్దరూ పెళ్లి కాకుండానే గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న విషయం తెల్సిందే. అదేసమయంలో నయనతారకు సినీ అవకాశాలు కూడా వరుసబెట్టి వస్తున్నాయి.