గురువారం, 31 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (17:38 IST)

బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్న ప్రభాస్?

prabas - kritisanon
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆమె ఎవరో కాదు.. తన కోస్టార్ కృతి సనన్. ఆమెతో ప్రభాస్ డేటింగ్‌లో ఉన్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల జరిగిన  కఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న కృతి సనన్ ప్రభాస్‌కు ఫోన్ చేసింది. అప్పటి నుంచి ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. అయితే, ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన స్నేహితులు అంటున్నారు. 
 
ప్రస్తుతం ప్రభాస్, కృతి సనన్‌లు కలిసి "ఆదిపురుష్" చిత్రంలో నటించగా, ఇది విడుదలకు సిద్ధమతుంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడుగా నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం ఇది పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా వచ్చే యేడాది విడుదలకానుంది.