శుక్రవారం, 14 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (14:54 IST)

పుష్ప-2 ఐటమ్ సాంగ్ షూట్ చేసేశారా?

Samantha item song
పుష్ప-2కి సంబంధించి ప్రస్తుతం ట్రెండింగ్‌లో వున్న విషయం ఏమిటంటే? పుష్ప-2 మేకర్స్ ఈ చిత్రం కోసం సూపర్-హైప్‌తో ఐటెమ్ సాంగ్ షూట్‌ను పూర్తి చేశారనేదే. "పుష్ప"లోని ఐటమ్ సాంగ్, దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఊ అంటావా పాటతో పాటు సమంతా రూత్ ప్రభు అద్భుతమైన గ్లామర్ ట్రీట్ కారణంగా వైరల్ అయ్యింది.
 
ఇక పుష్ప-2 లో ఇలాంటి పాట కోసం చాలా అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 మేకర్స్ ఇప్పటివరకు ఏ ఐటమ్ సాంగ్‌ను చిత్రీకరించలేదు. ప్రస్తుతం ఈ సినిమా టాకీ పార్ట్‌ను వీలైనంత త్వరగా ముగించాలనేది సుకుమార్ ప్లాన్.
 
ఇక సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ పాట కోసం ఫైనల్ ట్యూన్ చేస్తున్నట్లు సమాచారం.  మరోవైపు, పుష్ప-2 షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.