బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (13:58 IST)

పెళ్లి ఓల్డ్ ఫ్యాషన్.. సహజీవనమే బెస్ట్.. రాకేష్- సుజాత అదే బాట!?

Rakesh_sujatha
Rakesh_sujatha
పెళ్లి ఓల్డ్ ఫ్యాషనైపోయింది. ప్రస్తుతం సెలెబ్రిటీలు సహజీవనం వైపు దృష్టి సారిస్తున్నారు. తాజాగా బుల్లితెర నటీనటులు రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత సహజీవనం చేస్తున్నారన్న వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో వుంటున్నారని టాక్ వస్తోంది. 
 
బిగ్ బాస్ షోలో పాల్గొన్న సుజాతకు బుల్లితెర ఆఫర్స్ పెరిగాయి. ఆమె జబర్దస్త్ షో కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో రాకింగ్ రాకేష్ సుజాతకు దగ్గరయ్యారు. 
 
కొన్నాళ్లుగా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. కామెడీ షోస్ వేదికగా ఒకరిపై మరొకరు ప్రేమ కురిపిస్తున్నారు. ఇది ఉత్తుత్తిదే అనుకునేవారికి చెట్టాపట్టాలేసుకుని తిరిగే ఫోటోలు అక్కడక్కడ వైరల్ అయ్యాయి. దీంతో వీరి ప్రేమ వార్తలు నిజమేనని అందరూ నమ్మేశారు. త్వరలో పెళ్లి అని ఊహాగానాలు మొదలయ్యాయి.
 
అయితే పెళ్లి పక్కన పెట్టి సహజీవనం షురూ చేసినట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఇటీవల రచ్చ రవి కొత్త కారు కొన్నారు. రచ్చ రవితో కారు పక్కన నిల్చొని రాకేష్, సుజాత ఫోటోలు దిగారు. దీంతో వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని టాక్.