శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (12:10 IST)

రీల్‌ లైఫ్‌లో భార్యగా నటిస్తే రియల్‌ లైఫ్‌లో భార్య కాగలమా?

vishal-abhinaya
vishal-abhinaya
నటుడు విశాల్‌పై ప్రస్తుతం దృష్టి సారిస్తున్నారు. కానీ అభినయతో ప్రేమలో వున్నారని త్వరలో వివాహం చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. నాడోడిగల్ సినిమాతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అభియన టాలీవుడ్‌లోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని పాత్రలు చేస్తోంది. 
 
మూగ, చెవిటి యువతి అయిన అభినయ ఆ కొరతలను జయించి నటిగా రాణిస్తున్నారు. విశాల్‌తో ప్రేమ అనే ప్రచారం గురించి అభినయ స్పందిస్తూ తాను ప్రస్తుతం విశాల్‌ కథానాయకుడిగా నటిస్తున్న మార్క్‌ ఆంటోనీ చిత్రంలో ఆయనకు భార్యగా నటిస్తున్నానని చెప్పారు. 
 
రీల్‌ లైఫ్‌లో భార్యగా నటిస్తే రియల్‌ లైఫ్‌లో భార్య కాగలమా? అంటూ ప్రశ్నించారు. దీంతో విశాల్‌ అభినయల మధ్య ప్రేమ అనే వదంతులకు పుల్‌స్టాప్‌ పడినట్టు అయింది.